దారుణ స్థితిలో రూ.5 భోజన కేంద్రం

దారుణ స్థితిలో రూ.5 భోజన కేంద్రం

MBNR: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రూ.5 భోజన కేంద్రం నిర్లక్ష్యానికి గురవుతోంది. వందలాది పేదలు ఆధారపడే ఈ కేంద్రం చిరిగిన టెంట్ కిందే కొనసాగుతోంది. కనీసం అక్కడ కూర్చునే వసతి, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి శాశ్వత షెడ్, సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.