VIDEO: పాఠశాలలో నూతన శౌచాలయం ప్రారంభం
కృష్ణా: పెడన మండలంలో బల్లిపర్రు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నూతనంగా శౌచాలయం నిర్మించారు. కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే కాగిత కృష్ణాప్రసాద్‌తో కలిసి వాటిని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ ఈ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.