'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి'
SKLM: వచ్చే నెల 13వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. లోక్ అదాలత్‌లో క్రిమినల్, సివిల్, మోటారు ఆక్సిడెంట్, ప్రీ లిటిగేషన్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలన్నారు.