'టీమిండియా' స్ఫూర్తితో ముందుకెళ్దాం: మోదీ

'టీమిండియా' స్ఫూర్తితో ముందుకెళ్దాం: మోదీ

రాష్ట్రాల సీఎంతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను 'టీమిండియా'గా కలిసికట్టుగా పనిచేస్తేనే అధిగమించగలమని మోదీ పిలుపునిచ్చారు. ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ఇంధన భద్రతను నిర్ధారించుకుంటూ, పౌరుల ప్రయోజనాలను పరిరక్షించడం అత్యంత ముఖ్యమని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.