'ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి'
NTR: ఖరీఫ్ సీజన్ (2025–26)కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ అధికారులను ఆదేశించారు. ఆమె విజయవాడ రూరల్‌లో పర్యటించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. జిల్లాలో 150 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆమె తెలిపారు.