ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన MLA
BHPL: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా ఇవాళ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరై, ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్యాంకుల జాతీయీకరణ, పేదల సంక్షేమం, దేశ సమగ్రతకు ఆమె చేసిన కృషి అపూర్వమని కొనియాడారు.