'ది గర్ల్‌ఫ్రెండ్'పై జాన్వీ కపూర్ పోస్ట్

'ది గర్ల్‌ఫ్రెండ్'పై జాన్వీ కపూర్ పోస్ట్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' మూవీ సూపర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ మూవీపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ పోస్ట్ పెట్టింది. రష్మిక నటన, సినిమా స్టోరీ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుందని, ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉందని తెలిపింది. కచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ అని పేర్కొంది. కాగా, ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.