అంబటి మురళీకృష్ణ వ్యాఖ్యలపై టీడీపీ నేతల మండిపాటు

GNTR: వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని, నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ నేతలు వెంకటేశ్వరరావు, పఠాన్ అహ్మద్ ఖాన్ మండిపడ్డారు. ఆదివారం పొన్నూరులో మాట్లాడుతూ.. బాబు షూరిటీతో ప్రజలు విశ్వసించి గెలిపించారని, ఇప్పటికే పథకాల అమలు మొదలైందన్నారు. మత, కులాలకతీతంగా అభివృద్ధి సాధ్యం చేసిన వ్యక్తి ధూళిపాళ్ల నరేంద్రేనని తెలిపారు.