'సొసైటీలు బలోపేతం కావాలి'

'సొసైటీలు బలోపేతం కావాలి'

AKP: సొసైటీలు బలోపేతం కావడంతో పాటు రైతులు బాగుండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు అన్నారు. కోటవురట్ల డీసీసీబీ బ్రాంచ్‌లో సోమవారం మాట్లాడుతూ.. సొసైటీలను లాభాల బాటలోకి తీసుకొస్తామన్నారు. రైతులు లేకపోతే సొసైటీ, డీసీసీబీ లేదన్నారు. ఖరీఫ్ సీజన్లో రూ.572 కోట్లు పంట రుణాలు రైతులకు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ జనార్ధన్ పాల్గొన్నారు.