రాజన్న ఆలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం

రాజన్న ఆలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా గురువారం ఉదయం మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేక పూజలు అర్చకులు నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణ మండపంలో రుద్రాహవనము తర్వాత పూర్ణాహుతి, సాయంకాలం మహా లింగార్చన పూజా కార్యక్రమం జరగనుందని వెల్లడించారు. శ్రావణమాసం ముగుస్తుండడంతో ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు.