రాష్ట్రంలోనే మొట్టమొదటి వృద్ధుల మహిళా సంఘం

NZB: ఏర్గట్ల మండలంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి వృద్ధ మహిళా సంఘం ఏర్పాటైంది. పదిమంది వృద్ధ దళిత మహిళలతో 'అమ్మ వృద్ధుల మహిళా సంఘం' పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. వీరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పొదుపు ఖాతా కూడా తెరిచారు. ఈ సంఘం స్ఫూర్తితో మరింత మంది మహిళలు ఇలాంటి సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.