వేడి పాత్రలు మీద పడి వ్యక్తికి గాయాలు

వేడి పాత్రలు మీద పడి వ్యక్తికి గాయాలు

NLR: సీతారాంపురం మండలం చిన్నాగంపల్లి వద్ద జాతీయ రహదారి క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం వంటగదిలో ప్రమాదం కారణంగా ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. హైవే నిర్మాణ కార్మికులు వంట చేస్తుండగా వేడిగా ఉన్న వంట పాత్రలు అక్కడి వ్యక్తి మీద పడడంతో చేతులు, కాళ్లు, శరీరభాగాలు తీవ్రంగా కాలిపోయాయి. వెంటనే తోటి కార్మికులు అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.