జగన్ ఎప్పుడూ ఆధారాలతోనే మాట్లాడతారు: YCP

జగన్ ఎప్పుడూ ఆధారాలతోనే మాట్లాడతారు: YCP

AP: తమ పార్టీ చీఫ్ జగన్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఆధారాలు చూపిస్తూనే మాట్లాడతారని YCP నేత కారుమూరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. 'జగన్ వ్యక్తిగత ఆరోపణలు చేయబోరు. కానీ ఆయన చూపించే ఆధారాలకు సమాధానం చెప్పలేక TDP నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతుంటారు. నిన్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఆధారాలతో మాట్లాడకుండా నోటికొచ్చినట్లు జగన్ గురించి మాట్లాడారు' అని విమర్శించారు.