హన్మకొండలో అక్రమ చైనా మంజా పట్టివేత
హన్మకొండ నగరంలో అక్రమంగా చైనా మంజా (మోనోఫిల్ గోల్డ్) విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ఇవాళ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాను ఆనంద్ (55) అనే వ్యాపారిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి రూ. 2.03 లక్షల విలువైన మంజాను స్వాధీనం చేసుకుని, నిందితుడిని హన్మకొండ పీఎస్‌కు అప్పగించినట్లు ఎసీపీ మధుసూదన్ వెల్లడి.