'మైసూర్, హిసార్‌లకు రెగ్యులర్ రైలు సర్వీసులు'
KKD: మే 1 నుంచి కాకినాడ నుంచి మైసూర్, హిసార్‌లకు రెగ్యులర్ రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ వెల్లడించారు. ప్రత్యేక రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో రెగ్యులర్ చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేయడంతో ఫలితంగా రైల్వే శాఖ ఆమోదం తెలిపిందన్నారు.