'నిమజ్జనాలపై ఉత్సవ కమిటీలు జాగ్రత్త వహించాలి'

'నిమజ్జనాలపై ఉత్సవ కమిటీలు జాగ్రత్త వహించాలి'

GNTR: తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో వినాయక నిమజ్జనాలు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శుక్రవారం తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. విగ్రహ కమిటీ వారితో సమావేశం ఏర్పాటు చేశారు. వినాయక ఉత్సవాలు నిర్వహించే వారు కమిటీలుగా ఏర్పడాలన్నారు. పోలీసుల అనుమతి తప్పని సరిగా తీసుకోవాలన్నారు.