సిలిండర్ బ్లాస్ట్.. 15 గుడిసెలు దగ్ధం

HYD: ఎల్బీనగర్ అల్కాపూరి సాయి నగర్ కాలనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సిలిండర్ బ్లాస్ట్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి, ఈ ప్రమాదంలో 15 గుడిసెలు కాలిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.