ఎమ్మెల్యే ఆదిమూలం నేటి పర్యటన వివరాలు

TPT: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నేడు నాగలాపురంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే నాగలాపురం చేరుకుని 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరిస్తారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి బజారు వీధిలో కార్యక్రమం జరుగుతుందని సాగునీటి సంఘ అధ్యక్షుడు సెల్వకుమార్ తెలిపారు.