'మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచిత చేప పిల్లలు పంపిణీ'
NLG: మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని మార్కెట్ ఛైర్మన్ గుత్తా మంజులా మాధవ్ రెడ్డి అన్నారు. ఇవాళ కేతేపల్లి మండలం కొత్తపేట చెరువులో ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారులకు వలలు, ఇతర పరికరాలు సబ్సిడీ ద్వారా అందిస్తున్నామని తెలిపారు.