163 మందికి చెక్కులు పంపిణీ చేసిన తుమ్మల

KMM: పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో 163మంది లబ్ధిదారులకు సుమారు రూ.1,63,18,900 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరమని చెప్పారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.