పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

JGL: మెట్పల్లి, కోరుట్ల పోలీస్ స్టేషన్లను ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో 5ఎస్ అమలు చేసిన తీరును, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది డ్యూటీల గురించి అడిగి తెలుసుకున్నారు. పాత నేరస్థులపై నిఘా ఉంచాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. డీఎస్పీ రాములు, సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ ఉన్నారు.