'రామాయంపేటలో వార్డుల సమస్యల పరిష్కారమే లక్ష్యం'
MDK: రామాయంపేట మున్సిపల్ పరిధిలోని 1వ, 9వ వార్డుల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య ముమ్మరంగా పర్యటన చేపట్టారు. 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందితో కలిసి వార్డుల్లోని ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డుల్లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.