ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే

KNR: గంగధార మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మి భర్త రవిని కరీంనగర్ ఆసుపత్రిలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా కరీంనగర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో చేసిన పనుల కోసం తన భర్త రవి అప్పులు తీసుకువచ్చి పనులు చేశారని, నిధులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.