VIDEO: జిల్లాలో భారీ వర్షం.. ఇబ్బంది పడుతున్న ప్రజలు

WGL: జిల్లా వ్యాప్తంగా రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా వర్షాలు లేక ప్రజలు ఉక్కపోతతో అలమటించారు. నేడు కురిసిన వర్షం నగరంలో చల్లదనాన్ని నింపింది. అలాగే, పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై, రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.