తోఫాను పంపిణీ చేసిన SDPI

తోఫాను పంపిణీ చేసిన SDPI

నెల్లూరు నగరంలోని 43వ వార్డులో SDPI ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఇమామ్ భాష పాల్గొని నిరుపేద మహిళలకు రంజాన్ తోఫాను అందజేశారు. పవిత్రమైన రంజాన్ మాసంలో పేదలకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అవసరమైన కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా సేవా భావాన్ని చాటుకోవడం SDPI లక్ష్యమని తెలిపారు.