జాన్వీకి మద్దతిచ్చిన ప్రియాంక చోప్రా
సమానత్వం గురించి ఎప్పుడూ మాట్లాడాల్సిందేనని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ చెప్పింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సమానత్వం అనేది సంభాషణ, చర్చలతోనే మొదలవుతుంది. మహిళలు శక్తిమంతులు.. వారిని ప్రోత్సహించాలి' అని తెలిపింది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ప్రియాంక చోప్రా జాన్వీకు మద్దుతు తెలిపింది. ఇలా మాట్లాడేవారిని ప్రోత్సహించాలని పేర్కొంది.