చల్లవారిపల్లిలో శ్రీ కృష్ణదేవరాయలు జయంతి వేడుకలు
అన్నమయ్య: నిమ్మనపల్లి(మం) చల్లవారిపల్లిలో ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం శ్రీ కృష్ణదేవరాయలు జయంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ మదనపల్లి సీనియర్ నాయకులు తోట కళ్యాణ్, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు యువతతో కలిసి కేక్ కట్ చేశారు.