చక్రేశ్వరాలయములో శ్రావణమాస ప్రత్యేక పూజలు

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వరాలయంలో శ్రావణ మాస ప్రత్యేక పూజలు ప్రారంభించినట్లు అర్చకులు గణేష్ శర్మ తెలిపారు. శ్రావణమాసంలో నేటి నుంచి ప్రతిరోజు బిల్వార్చన, మహన్యాస పూర్వక రుద్రాభిషేకము, కుంకుమార్చనలు మొదలగు పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇట్టి పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరారు.