ఎల్లంపల్లి గ్రామాన్ని సందర్శించిన ఎస్టీ కమిషన్ చైర్మన్

ఎల్లంపల్లి గ్రామాన్ని సందర్శించిన ఎస్టీ కమిషన్ చైర్మన్

RR: షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. హత్యకు గురైన రాజశేఖర్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని మానవతావాదులు, ప్రతి ఒక్కరు ఈ ఘటనను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం రాజశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.4.12 లక్షల చెక్కును అందజేశారు.