బ్యాలెట్ బాక్సుల భద్రతపై సమీక్షా సమావేశం
కామారెడ్డి జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ బాక్సుల భద్రతపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నిన్న సాయంత్రం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సాధారణ పరిశీలకులు సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. పోలింగ్‌లో వినియోగించే బ్యాలెట్ బాక్సుల పంపిణీ, భద్రత, నిల్వ, రవాణా, సీలింగ్ అంశాలపై నోడల్ అధికారులకు కలెక్టర్ వివరించారు.