'జప్తు చేసిన వాహనాలు ఈనెల 10న వేలం'

'జప్తు చేసిన వాహనాలు ఈనెల 10న వేలం'

CTR: ఎక్సైజ్ కేసుల్లో జప్తు చేసిన వాహనాలను ఈనెల 10వ తేదీన సోమవారం పుంగనూరు ఎక్సైజ్ స్టేషన్‌లో బహిరంగ వేలం వేయనున్నట్లు CI సురేష్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలంలో పాల్గొనాలనుకునేవారు వారి ఆధార్ కార్డు మరియు సంబంధిత ధరావత్ రుసుమును చెల్లించాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం పుంగనూరులోని కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.