ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BPT: చీరాలలోని మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని సమస్యలపై ప్రజలనుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. వెంటనే వాటిని ఆయా శాఖల అధికారులకు బదలాయించి పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచవద్దని సూచించారు.