మూడు రోజుల్లో మూడోసారి

ADB: బజార్హీత్నూర్ మండలంలోని మోర్ఖండి వద్ద ఉన్న వాగు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూడోసారి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న పాత వంతెన కొట్టుకుపోవడంతో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. దీనిపై రాజకీయవేత్తల, స్పందించి, తక్షణమే కొత్త వంతెన నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.