VIDEO: రేపు కలెక్టరేట్ ఎదుట టీజీఈ జేఏసీ నిరసన
SRPT: ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టనున్నట్లు టీజీఈ జేఏసీ జిల్లా ఛైర్మన్ ఎస్‌కే జానీమియా, అడిషనల్ సెక్రటరీ జనరల్ తంగేళ్ల జితేందర్ రెడ్డి తెలిపారు. పీఆర్‌సీ, సీపీఎస్ రద్దు వంటి డిమాండ్లపై మధ్యాహ్నం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిరసనకు ఉద్యోగులంతా తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.