ప్రత్యేక అలంకరణలో బోయకొండ గంగమ్మ

అన్నమయ్య: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని రంగురంగుల పూలు, బంగారు నగలతో అత్యంత సుందరంగా అలంకరించారు. మహిళలు ఉపవాస దీక్షలతో ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం ఈవో ఏకాంబరం పర్యవేక్షణలో అమ్మవారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.