నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
SKLM: కవిటి మండలం బొరి వంక, రాజపురం విద్యుత్ ఉప కేంద్రాల పరిధిలో విద్యుత్ నిర్వహణ పనుల నిమిత్తం సోమవారం పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ యజ్ఞేశ్వరరావు ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బెజ్జి పుట్టుగ, దూగాన పుట్టుగ, బంజు పుట్టుగ తదితర గ్రామాలలో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.