'సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు ఉపయోగపడతాయి'
RR: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని సీఐ నరహరి అన్నారు. సోమవారం కేశంపేట మండల పరిధిలోని నిర్దవెల్లి గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో నేరాలను నియంత్రించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.