'సమస్యల సమాచారం తెలుసుకోవడం ఇకపై సులభతరం'
MNCL: విద్యుత్ తీగల డిజిటలీకరణ, అసెట్ మ్యాపింగ్, ట్రాకింగ్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని జిల్లా విద్యుత్ SE రాజన్న ఓ ప్రకటనలో తెలిపారు. 33KV లైన్‌లో 26, 11KV లైన్‌లో 133 ఫీడర్ల పనులు పూర్తి చేశామని చెప్పారు. స్తంభాల వారీగా పెట్రోలింగ్ చేయడం సులభమవుతుందని, సమస్య సమాచారం వెంటనే తెలుసుకొని పరిష్కరించవచ్చన్నారు.