వరల్డ్ స్కేట్ పసిఫిక్ కప్ పోటీలకు నర్సీపట్నం బాలిక

AKP: ఆస్ట్రేలియా క్వీన్స్ ల్యాండ్ మౌంట్ వారెన్‌లో ఈనెల 28 నుంచి 31 వరకు జరిగే వరల్డ్ స్కేట్ పసిఫిక్ కప్ -2025 పోటీలకు భారత్ తరపున నర్సీపట్నంకు చెందిన రోలర్ స్కేటర్ పీ.చైత్రదీపిక పాల్గోనున్నారు. ఈ సందర్భంగా పట్నంకు చెందిన ప్రముఖులు, స్నేహితులు కుటుంబ సభ్యులు ఆమెను అభినందించారు. దేశానికి మంచి పథకాలు సాధించాలని వారు కోరారు.