VIDEO: హైవే పై నిరసనలు.. న్యాయం చేయాలని డిమాండ్

VIDEO: హైవే పై నిరసనలు.. న్యాయం చేయాలని డిమాండ్

ATP: రాయదుర్గం(M) కాశీపురం వద్ద హైవేపై ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేటు ఉద్యోగి బసవరాజు మృతి చెందాడు. సమాచారం అందుకున్న బంధువులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకుని హైవే పై బైటాయించారు. మృతుడి కుటుంబానికి కంపెనీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సై ప్రసాద్ సిబ్బంది అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పినా ససేమిరా అంటూ బైటాయించి నిరసన తెలిపారు.