ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం : కలెక్టర్

ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం : కలెక్టర్

కృష్ణా: ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ముద్రించిన పల్స్ పోలియో కార్యక్రమ గోడపత్రికలను సోమవారం ఆయన కలెక్టరేట్‌లో నిర్వహించారు. చిన్నారుల బంగారు భవిష్యత్తుకై పోలియో చుక్కలు తప్పక వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ డా. యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.