జాతీయ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే

ELR: స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయులను ఎల్లప్పుడు స్మరించుకోవాలని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. స్వాతంత్య్రం దినోత్సవ సందర్భంగా శుక్రవారం ఉంగుటూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్యే జాతీయ జెండాను ఎగరవేశారు. ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, ఎంపీడీవో మనోజ్, తాహసీల్దార్ పూర్ణచంద్ర ప్రసాద్, గ్రామ సర్పంచ్ బండారు సింధు మధుబాబు పాల్గొన్నారు.