పేలుడు పదార్థాలు తిన్న గేదేలు.. ఏమైందంటే.?

పేలుడు పదార్థాలు తిన్న గేదేలు.. ఏమైందంటే.?

MNCL: పేలుడు పదార్థాలు గేదేలు నమలడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఘటన జన్నారం (M) బాదంపల్లిలో జరిగింది. గోదావరి సమీపంలో మేత మేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు కాపరులు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని మరో 15 పేలుడు గోళీలను గుర్తించారు. అడవి పందులను వేటాడేందుకు జగిత్యాల జిల్లాకు చెందిన కొందరు వీటిని అమర్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.