అక్రమంగా గ్యాస్ సిలిండర్లు వినియోగం.. వ్యక్తి అరెస్ట్

అక్రమంగా గ్యాస్ సిలిండర్లు వినియోగం.. వ్యక్తి అరెస్ట్

WGL: వరంగల్ నగరంలో లక్ష్మి టాకీస్ టిఫిన్ సెంటర్ యజమాని అక్రమంగా ఎల్పీజీ సిలిండర్లు వినియోగిస్తున్న సమాచారం మేరకు గురువారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో టిఫిన్ సెంటర్ యజమాని ఏగా రాజా వద్ద 9 గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఇంతేజార్‌గంజ్ పోలీసులకు కేసు నమోదు నిమిత్తం అప్పజెప్పినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు.