ఫేక్‌ నంబర్‌ ప్లేట్లతో రోడ్లపై వాహనాలు.. పోలీసులకు సవాల్

ఫేక్‌ నంబర్‌ ప్లేట్లతో రోడ్లపై వాహనాలు.. పోలీసులకు సవాల్

WGL: నగరంలో కొందరు వాహనాల నంబర్‌ ప్లేట్లు మార్చి ట్రాఫిక్‌ చలానాలు తప్పించుకుంటున్నారు. మరికొందరు నంబర్‌ ప్లేట్‌ లేకుండానే లేదా రిజిస్ట్రేషన్‌ చేయకుండానే వాహనాలు నడుపుతున్నారు. పోలీసుల తనిఖీల్లో వందల సంఖ్యలో ఇలాంటి వాహనాలు బయటపడుతున్నాయి. పోలీసులు ఆధునిక టెక్నాలజీతో నకిలీ నంబర్లపై నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కొందరి నిర్లక్ష్య ధోరణి మారడం లేదు.