'అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దు'

'అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దు'

VZM: జిల్లాలో గృహ అవసర గ్యాస్ సరఫరాపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి జి. మురళీనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని, సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దని సూచించారు.