50 రాళ్ల మొరవలో కృష్ణా జలాలు

50 రాళ్ల మొరవలో కృష్ణా జలాలు

CTR: పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువుకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను మంగళవారం విడుదల చేశారు. దీంతో చెరువు పూర్తిస్థాయిలో నిండింది. జలాలకు పూజలు నిర్వహించి 50 రాళ్ల మొరవను విడిచారు. మొరవ ప్రారంభం కావడంతో చూసేందుకు ప్రజలు ఆసక్తిగా తరలివస్తున్నారు. నీటి ప్రవాహాన్ని చూసి సెల్ఫీలు, ఫోటోలు దిగుతున్నారు. ఆయకట్టు రైతులు వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు.