వైసీపీ నేత చెవిరెడ్డి పిటిషన్ కొట్టివేత
AP: మద్యం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. మంతెన ఆశ్రమంలో చికిత్సకు అనుమతి కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మద్యం కేసులో చెవిరెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.