రేపు తలకొండపల్లి మండలంలో ఎమ్మెల్యే పర్యటన

RR: తలకొండపల్లి మండలంలో రేపు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయనున్నట్లు క్యాంపు కార్యాలయం ఇంఛార్జ్ తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం మండలంలోని పడకల్లు గ్రామంలో సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీకి, పాతకోట తండాలో అంగన్వాడి భవన నిర్మాణానికి, ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నట్లు చెప్పారు.