రౌడీ షీటర్లకు సీఐ కౌన్సిలింగ్

రౌడీ షీటర్లకు సీఐ కౌన్సిలింగ్

కృష్ణా: గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో టూ టౌన్ సీఐ హనీష్ కుమార్ రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్‌లో చేసిన తప్పులను సరిదిద్దుకొని, భవిష్యత్తులో సమాజంలో మంచి వ్యక్తులుగా మెలగాలని సీఐ హనీష్ కుమార్ తెలిపారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో మెలగాలని, ఎటువంటి నేరాలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు.